ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-07-01T06:45:12+05:30

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్ధన్‌ అన్నారు. గురువారం నేరేడుచర్ల, పెంచికల్‌దిన్న పీహెచ్‌సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.

నేరేడుచర్ల పీహెచ్‌సీలో మొక్క నాటుతున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్ధన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్ల, జూన్‌ 30: సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో హర్షవర్ధన్‌ అన్నారు. గురువారం నేరేడుచర్ల, పెంచికల్‌దిన్న పీహెచ్‌సీలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ వైద్యశాలలో సాధారణ కాన్పుల సంఖ్య పెంచా లని, గర్భిణులు, మహిళలు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా పీహెచ్‌సీలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైద్యాధికారులు నాగయ్య, హరికిషన్‌నాయక్‌, వైద్య సిబ్బంది శ్యాంసుందర్‌రెడ్డి, నర్సయ్య, రమేష్‌, హరికిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

సాధారణ కాన్పులకు ప్రభుత్వ ప్రోత్సాహం

సాధారణ కాన్పులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మునిసిపల్‌  చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషలక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంలోని 27వ వార్డులోని  అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు ప్రసవాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ షాబు ద్దీన్‌, వైద్యురాలు శైలజ, సురేందర్‌, వీర్ల లక్ష్మి తదిత రులు పాల్గొన్నారు.       




Updated Date - 2022-07-01T06:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising