ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

ABN, First Publish Date - 2022-08-12T17:27:02+05:30

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి (Yadadri): తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు బహిరంగ లేఖ రాశారు. రాఖీ (Rakhi) పౌర్ణమి  సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ. 4 వేల కోట్ల వడ్డీ బకాయిలు విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), ఎస్‌హెచ్‌జీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయన్నారు. టీఆర్‌ఎస్‌ ఎనిమిదేళ్ల పాలనలో డ్వాక్రా గ్రూపులను నిర్వీర్యం చేశారని విమర్శించారు. 2021-22 బడ్జెట్‌లో మహిళా గ్రూపులకు వడ్డీ చెల్లించేందుకు రూ. 3 వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. 2022-23 బడ్జెట్‌లో రూ. 1250 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదన్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందని ఆశతో రుణాలు తీసుకున్న మహిళలు ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-08-12T17:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising