ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహుజన నేత సర్వాయి పాపన్న

ABN, First Publish Date - 2022-05-01T06:33:15+05:30

వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ బహుజన నేత అని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖామంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆయన జయించిన కోటలను పర్యాటక కేంద్రంగా మారుస్తాం

ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

ఆలేరు రూరల్‌, ఏప్రిల్‌ 30: వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ బహుజన నేత అని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, యువజన క్రీడల శాఖామంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ఆలేరులో గౌడ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాపన్నగౌడ్‌ చరిత్ర గొప్పదని, బహుజన, పేద వర్గాల కోసం తపించిన గొప్ప రాజు అని కొనియాడారు. పాపన్నను ఒకే సామాజికవర్గానికి చెందిన వాడిగా చూడడం సరికాదన్నారు. రజక వర్గానికి చెందిన సర్వాయి పేరును తన ఇంటి పేరుగా మార్చుకొని స్నేహానికి ప్రతిరూపంగా నిలిచారన్నారు. 33కోటలను జయించి గోల్కొండ రాజధానిగా గొప్ప పాలన కొనసాగించారన్నారు. గత పాలకులు ఆయన చరిత్రను కనుమరుగు చేయాలని చూశారని, ప్రత్యేక రాష్ట్రంలో ఆయన పేరును ప్రపంచవ్యాప్తం చేశామన్నారు. తాటికల్లులో క్యాన్సర్‌ను నివారించే గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నితే గౌడన్నలకు అండగా నిలిచి రూ.16కోట్ల రుణమాఫీని చేసి తిరిగి తెరిపించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. రూ.10కోట్లతో హైదరాబాద్‌ నడిబొడ్డున నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలేరులో కూడా నీరా కేంద్రానికి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. పాపన్న జయించిన కోటలన్నింటినీ కలిపి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టెస్కాబ్‌ వైస్‌చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, సూదగాని హరిశంకర్‌, నారాయణగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మొగుల గాని మల్లేశం, మునిసిపల్‌ చైర్మన్‌ వత్పరి శంకరయ్య, వైస్‌చైర్మన్‌ మొరిగాడి మాధవి, గీస కృష్ణరాజు, ఎల్లందుల మల్లేశం, గౌడ సంఘం అధ్యక్షుడు గనగాని శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-01T06:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising