ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్యకర్తలపై దాడి హేయం : సంకినేని

ABN, First Publish Date - 2022-10-07T05:46:52+05:30

బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంకినేని వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుంగతుర్తి, అక్టోబరు 6: బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు. మండలకేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పథకం ప్రకారమే బీజేపీ నాయకులపై దాడి చేస్తూ పూజారిని కూడా రానీయకుండా రామాలయం ఎదుట నాటిన జమ్మిచెట్టును తీసివేస్తూ ఆరాచక వాతావరణం సృష్టించారన్నారు. రాళ్లదాడిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబుతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం గడి, గ్రామ పంచాయతీ, దేవాలయం ఎదుట దసరా పూజలు చేశారని తెలిపారు. దానిని తోసిపుచ్చి కేవలం టీఆర్‌ఎస్‌ నాయకులు పూజలు చేసి అక్కడికి వస్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్యన్నారు. పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోవడంలేదని ఆరోపిం చారు. ఈ సమావేశంలో బీజేపీ నియోజకవర్గఇ న్‌చార్జి కడియం రామచంద్రయ్య, నాయకులు కాప రవికుమార్‌, మల్లెపాక సాయిబాబ, గాజుల మహేందర్‌, చిరంజీవి, రమేష్‌, సోమన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising