ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంగ్‌రూట్‌లో వచ్చి .. బైక్‌ ఢీ

ABN, First Publish Date - 2022-05-27T06:35:47+05:30

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందగా, మరో ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మునగాల మండల

వెంకట అప్పారావు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

మునగాల, మే 26 : రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందగా, మరో ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మునగాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాలునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం పెన్‌పహాడ్‌ మం డలం తంగెళ్లగూడెం గ్రామానికి చెందిన చందా వెంకట అప్పారావు(42) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మునగాల మండలం నారాయణగూడెంలో పనిచేస్తూ, కోదాడలో నివాసం ఉంటున్నాడు. పదో తరగతి పరీక్షల విధుల్లో పాల్గొనేందుకు మునగాల ఉన్నత పాఠశాలకు వచ్చాడు. అదేవిధంగా మండలంలోని కోదండరామాపురం పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణచారి స్థానిక సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్‌ విధులు నిర్వర్తించారు. పరీక్షల విధుల అనంతరం ఇద్దరూ కలిసి బైక్‌పై కోదాడకు వెళ్తున్నారు. మునగాల ఫ్లైఓవర్‌ బ్రిడ్జిపైకి రాగానే రాంగ్‌ రూట్‌లో బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయులిద్దరూ రోడ్డుపై చెల్లాచెదరుగా పడిపోయారు. వాహనం నడుపుతున్న వెంకటఅప్పారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో కోదాడ ఆస్పత్రికి తరలించా రు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. లక్ష్మణాచారికి స్వల్ప గాయాలయ్యా యి. కోదాడ ఆస్పత్రిలో వెంకటఅప్పారావు భౌతికకాయానికి ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.   వెంకటఅప్పారావుకు భార్య, పాప ఉన్నారు. భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

హెల్మెట్‌ ఉన్నా.. క్లిప్‌ పెట్టకపోవడంతో 

తలకు హెల్మెట్‌ ధరించినప్పటికీ క్లిప్‌ పెట్టకపోవడంతో వెంకటఅప్పారావు మృతి చెందారు. ప్రమాద సమయంలో బైక్‌ నడుపుతుండగా, ఎదురుగా వచ్చిన బైక్‌ బలంగా ఢీకొనడంతో కింద పడిపోయాడు. ఆ సమయంలో హెల్మెట్‌ విడిపోగా తల డివైడర్‌ను ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. హెల్మెట్‌కు క్లిప్‌ పెట్టి ఉంటే ప్రాణం దక్కేదని పలువురు అంటున్నారు.

Updated Date - 2022-05-27T06:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising