ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకతీయ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

ABN, First Publish Date - 2022-07-06T06:05:07+05:30

కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చందుపట్లలో వేడుకల నిర్వహణ 

కలెక్టర్‌ రాహుల్‌శర్మ 

నల్లగొండ టౌన్‌, జూలై 5: కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలను ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నిర్వహిస్తున్నందున, అందులో భాగంగా ఈ నెల 11న జిల్లాలోని నకిరేకల్‌ మండలం చందుపట్లలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. చందుపట్లలో రుద్రమాదేవి మరణశాసనం ఉందని, ఇది కాకతీయుల పరిపాలనకు సంబంధించిన అతి ముఖ్యమైన, అరుదైన శాసనంగా ఆయన అభివర్ణించారు. కాకతీయుల కాలం నాటి వైభవాన్ని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాలతో పాటు పేరిణి నృత్యం, కూచిపూడి, నాటకం, సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఏర్పాటు చేయాలని స్థానికంగా స్టేజి, ఇతర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాకతీయుల చరిత్ర, ప్రాశస్త్యంపై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా ఎంపిక చేసిన వారికి ఆరోజున సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కాకతీయుల చరిత్ర గురించి క్షుణ్నంగా అధ్యయనం చేసిన యూనివర్సిటీ చరిత్ర అధ్యాపకులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జగదీశ్వర్‌రెడ్డి, డీఈవో భిక్షపతి, డీపీఆరోవో శ్రీనివాస్‌, డీవైఎ్‌సవో మక్బుల్‌ అహ్మద్‌, కలెక్టరేట్‌ పరిపాలన అధికారి మోతీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవీఎంల తనిఖీ

భారత ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు మంగళవారం కలెక్టరేట్‌లో గల ఈవీఎం గోదాంలను కలెక్టర్‌ రాహుల్‌శర్మ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఈ తనిఖీలను నిర్వహించి తనిఖీ నివేదికలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, ఎన్నికల డీటీ విజయ్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బక్క పిచ్చయ్య, నర్సిరెడ్డి, సత్యనారాయణ, అశోక్‌, రజియొద్దీన్‌, యాదగిరి పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T06:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising