ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చింత’తీరేనా?

ABN, First Publish Date - 2022-05-16T06:28:44+05:30

హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై మండల కేంద్రంలో ఉన్న పోలీ్‌సస్టేషనకు సిబ్బంది కొరత పీడిస్తుంది.

చింతపల్లి పోలీ్‌సస్టేషన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ పోలీ్‌సస్టేషనలో సిబ్బంది కొరత

30 మందికి ఉన్నది ఆరుగురే సిబ్బంది 

మండలంలో జోరుగా ఇసుక అక్రమ రవాణా, గంజాయి, గుట్కా దందా 

పోలీస్‌ ఉన్నతాధికారులకు పట్టని చింతపల్లి పోలీ్‌సస్టేషన 


చింతపల్లి, మే 15:  హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై మండల కేంద్రంలో ఉన్న పోలీ్‌సస్టేషనకు సిబ్బంది కొరత పీడిస్తుంది. ఎస్‌ఐతో పాటు ఇద్దరు ఏఎ్‌సఐలు కలిపి మొత్తం 30 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఇందులో ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు  విధులు నిర్వహిస్తున్నారు. పలు అవినీతి ఆరోపణలతో 20 రోజుల క్రితం ఎస్‌ఐ, రైటర్‌ను స స్పెండ్‌ చేయగా మూడేళ్లుగా ఇద్దరు ఏఎ్‌సఐ పోస్టులను భర్తీ చేయలేదు. ఇంకా ఉన్న సిబ్బందిలో ఏడుగురు కానిస్టేబుళ్లకు ప్రమోషన్లతో వివిధ ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. మరికొంత మంది సిబ్బంది డిప్యూటేషనలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. 50 వేల పైచిలుకు జనాభా కలిగిన చింతపల్లి మండలంలో 34 గ్రామపంచాయతీలు ఉన్నాయి.  మండలంలో తరచుగా గొడవలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తోడు రహదారిపై నిరంత రం ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాతపడటంతో పాటు అధిక సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. పోలీసుల నియంత్రణ లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మండలంలోని అనాజీపురం, కుర్మేడు, ఘడియగౌరారం, ఇతర వాగుల నుంచి రాత్రివేళల్లో జోరుగా హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా చేస్తూ వ్యాపారులు లక్షలాది రూపాయలు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకోవైపు మండలంలోని వీటీనగర్‌, చింతపల్లి మండల కేంద్రాల్లో గంజాయి, గుట్కా వ్యాపారాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.  

ఇనచార్జి ఎస్‌ఐ కూడా లేకపోవడం గమనార్హం

హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారిపై ఉన్న చింతపల్లి పోలీ్‌సస్టేషనకు 20రోజులుగా ఇనచార్జి ఎస్‌ఐని కూడా ఉన్నతాధికారులు నియమించలేదు. పోలీ్‌సస్టేషనకు వచ్చే ప్రజలు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు. వెం టనే చింతపల్లి పోలీ్‌సస్టేషనలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐతో పాటు ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

ఎస్పీ దృష్టి సారించేనా...? 

చింతపల్లి మండల పోలీ్‌సస్టేషనలో అధిక సంఖ్య లో సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో తరచుగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. పోస్టుల భర్తీపై ఎస్పీ రెమారాజేశ్వరి దృష్టి సారిస్తా రా, లేదా అని మండలంలో చర్చ సాగుతుంది. రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన మొండెం లేని తల ఘటన  చింతపల్లి మండలంలోనే జరిగిన విషయం విదితమే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చింతపల్లి పోలీ్‌సస్టేషనకు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం 

చింతపల్లి పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఐతో పాటు సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. చింతపల్లి పోలీ్‌సస్టేషనకు ఎస్‌ఐతో పాటు ఖాళీలన్నీ భర్తీ చేయాలని జిల్లా అధికారులకు నివేదికలు పంపించాం. 

- నాగేశ్వర్‌రావు, డీఎస్పీ, దేవరకొండ

Updated Date - 2022-05-16T06:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising