ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ గ్రామపంచాయతీగా ఆమనగల్లు

ABN, First Publish Date - 2022-04-28T06:02:46+05:30

సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రంలోని 19గ్రామాల్లో వేముల పల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామం 16వ స్థానం దక్కించుకుంది. ఉత్తమ గ్రామంగా ఎంపిక కావడం పట్ల సర్పంచ్‌ వల్లంపట్ల ఝాన్సీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రాధా న్యత ఇవ్వడం

ఆమనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశంలో 16వ స్థానం 

వేములపల్లి, ఏప్రిల్‌ 27: సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రంలోని 19గ్రామాల్లో వేముల పల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామం 16వ స్థానం దక్కించుకుంది. ఉత్తమ గ్రామంగా ఎంపిక కావడం పట్ల సర్పంచ్‌ వల్లంపట్ల ఝాన్సీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రాధా న్యత ఇవ్వడంతోపాటు మౌలిక వసతుల కల్పన, పల్లెప్రకృతి వనం కార్యక్రమాలతో పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు. దీంతోపాటు పల్లెల అభివృద్ధి కోసం ప్రతి గ్రామపంచాయతీకి అవసరమైన నిధులు కేటా యించడంతో గ్రామా భివృద్ధికి నిరంతరం చేసిన కృషి ఫలితంగా దేశస్థాయిలో ఆమనగల్లు ఆదర్శ గ్రామపంచాయతీగా 89.17 స్కోరుతో 16వ స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామంలో పారిశుధ్యం, వీధి దీపాలు, డంపింగ్‌ యార్డుకు చెత్త తరలించడం, సీసీరోడ్లు, వీధుల శుభ్రత, నర్సరీలో మొక్కల పెంపకంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అర్హులైన వారికి అందేలా కృషి చేసినట్లు సర్పంచ్‌ తెలిపారు. 

Updated Date - 2022-04-28T06:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising