ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని నల్ల చట్టాలను రద్దు చేయాలి : వేణుగోపాల్‌

ABN, First Publish Date - 2022-05-16T06:15:39+05:30

అన్ని నల్ల చట్టాలను రద్దు చేయాలని వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు.

సదస్సులో మాట్లాడుతున్న వేణుగోపాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిరేకల్‌, మే 15: అన్ని నల్ల చట్టాలను రద్దు చేయాలని వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివా రం పట్టణంలోని జడ్పీ హైస్కూల్‌ ఆడిటోరియంలో డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన నిర్వహించిన శేషు స్మారక సదస్సుకు ఆయన హాజరయ్యారు. భారత రాజ్యాంగం - సవాళ్లు, పాలకుల నైజం అనే అం శంపై ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో రాజద్రో హ నేరం కింద కేసులు పెట్టడం, ఇతర నల్లచట్టాలను ఉపయోగిం చి ప్రజా మేధావులను, ప్రజాస్వామిక వాదులను గొంతునొక్కుతున్నారని ఆరోపించారు. సంఘ పరివార్‌ శక్తులు అంబేడ్కర్‌ రచించి న రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద సంస్కృతిని బలపరిచే చట్టాలను తీసుకువచ్చేందు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలు పునిచ్చారు. డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రఘుశంకర్‌రెడ్డి, లింగారెడ్డి మాట్లాడుతూ ఈ వేసవిలోనే ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని అన్నారు. సదస్సులో డీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమయ్య, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశం, నాయకులు విద్యాసాగర్‌రెడ్డి, పూజార్ల శంభయ్య, చెరు కు సుధాకర్‌, కమిటీ బాఽధ్యులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-16T06:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising