ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం: విప్‌ సునీత

ABN, First Publish Date - 2022-01-19T05:18:50+05:30

గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు.

రేషన్‌దుకాణాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుర్కపల్లి, జనవరి 18 : గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. మండలంలోని దయ్యంబండతండాలో ప్రభుత్వ రేషన్‌ దుకాణాన్ని ఆమె మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. తండాల్లో రేషన్‌ దుకాణాల ఏర్పాటుతో గిరిజనుల ఇబ్బందులు తొలగుతాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్య సుశీలారవీందర్‌నాయక్‌, జడ్పీవై్‌సచైర్మన్‌ ధనావత్‌ బీకునాయక్‌, పీఏసీఏస్‌ చైర్మన్‌ సింగిరెడ్డి నర్సింహారెడ్డి, తహసీల్దార్‌ రవికుమార్‌, సర్పంచ్‌ మాడోతు లలితాశ్రీనివా్‌సనాయక్‌, రైతుబంధు మండల అధ్యక్షుడు కొమిరిశెట్టి నర్సింహులు, పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్‌కుమార్‌, ఉపసర్పంచ్‌ మహేందర్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌, నరేందర్‌నాయక్‌ ఉన్నారు. 

మా భూములు తీసుకోవద్దు : రైతులు

మండల కేంద్రంలోని సర్వే నెంబరు 72లోని 108 ఎకరాల అసైన్డ్‌ భూములను పారిశ్రామిక కారిడార్‌కు కేటాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారని; ఆ భూములు  తీసుకుంటే మా పరిస్థితి ఏంటంటూ బాధిత రైతులు ఎమ్మెల్యే గొంగిడి సునీతను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. దయ్యంబండతండాలో పర్యటించి వెళ్తున్న ఎమ్మెల్యేను రైతులు కలిసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సేద్యం చేసుకుంటున్న భూములు తీసుకోరని; రైతులు ఎవరూ అధైర్యపడవద్దని కోరారు. కార్యక్రమంలో రైతులు ఎండీ యాకుబ్‌, బోయిని బాలయ్య, కూరెళ్ల బాలాచారి, ఆకుల నర్సయ్య, కసిరబోయిన స్వామి, సాయిలు, జక్కుల బిక్షపతి ఉన్నారు. 

Updated Date - 2022-01-19T05:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising