ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడావుపెట్టిన భూముల్లో ఎర్రజెండాలు పాతుతాం

ABN, First Publish Date - 2022-03-05T06:30:24+05:30

రాష్ట్ర వ్యాప్తంగా పడావుపెట్టిన భూముల్లో ఎర్రజెండాలు పాతుతామని వ్యవసా య కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న నాగయ్య, చిత్రంలో వెంకట్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి వెంకట్‌

యాదాద్రి రూరల్‌, మార్చి 4 రాష్ట్ర వ్యాప్తంగా పడావుపెట్టిన భూముల్లో ఎర్రజెండాలు పాతుతామని వ్యవసా య కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి. వెంకట్‌ అన్నారు. గుట్టలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వ్యవసాయరంగా న్ని నిర్లక్ష్యం చేయడంతో రైతులను రియల్టర్లు మాయలోకి దింపి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారన్నారు. దీంతో వ్యవసాయానికి భూములు కరువై గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు పనిలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి పడావుపెట్టిన వాటిని గుర్తించి ఎర్రజెండాలు పాతుతామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు ఉండగా, వాటిని పేదలకు పంచకుండా రియల్టర్లకు కట్టబెడుతున్నారన్నారు. కనీస వసతులు లేని వైద్య, విద్యతో పాటు పోరాడి సాధించుకున్న ఉపాధిహామీ పథకానికి సైతం బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. అనంతర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా జి.నాగయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, బొప్పని పద్మ, కార్యదర్శులు కొండమడుగు నర్సింహ, నారీ ఐలయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, కందుకూరి జగన్‌, వెంకటేశ్వర్‌రావు, ముల్కలపల్లి రాములు, కనకయ్య, జిల్లా కార్యదర్శి మంగ నర్సింహులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి,  పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising