ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-17T06:19:46+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన పాదయాత్రపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

నల్లగొండలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగిరి/చండూరు/కేతేపల్లి/ కట్టంగూరు/నార్కట్‌పల్లి, ఆగస్టు 16: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన పాదయాత్రపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. పాదయాత్రపై దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే టీఆర్‌ఎస్‌ గుండాలు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మో ర్చా రాష్ట్ర కార్యదర్శి సాంబయ్య, పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, రావెళ్ల కాశమ్మ, నెవర్సు నీరజ, జిల్లా నాయకులు పాల్గొన్నారు. చండూరులో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోమటి వీరేశం, అన్నెపర్తి యాదగిరి, సముద్రాల వెంకన్న, కొత్తపాటి సతీష్‌, లింగ స్వామి పాల్గొన్నారు. కేతేపల్లిలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.గోపి, పిట్టల వెంకట్‌, బి.సతీష్‌, జె.సైదులు, జి.వేణుగోపాల్‌రెడ్డి, పాల్గొన్నారు. కట్టంగూరులో జరిగిన కార్యక్రమంలో దళితమోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి ప్రభాకర్‌, కోమటి భాస్కర్‌, ముడుసు భిక్షపతి, పాదూరి వెంకట్‌రెడ్డి, పసుల సైదులు, తండు సైదులు ఉన్నారు. నార్కట్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కొర్వి శంకర్‌, పాల్వాయి భాస్కర్‌రావు, లింగాల వీరయ్య, నడింపల్లి శ్రవణ్‌, మునుకుంట్ల గణేశ్‌, ఉండ్రాతి నవీన్‌, కోణం సత్యం, రూపని సతీశ్‌, పాలకూరి రమేశ్‌, కల్లూరి కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T06:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising