మద్యం మత్తులో నిప్పు అంటించుకున్న యువకుడు
ABN, First Publish Date - 2022-12-16T01:41:25+05:30
మద్యం మత్తులో ఓ యువకుడు నిప్పు అంటించుకున్నాడు.
సూర్యాపేట రూరల్, డిసెంబరు 15: మద్యం మత్తులో ఓ యువకుడు నిప్పు అంటించుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన వల్ధాస్ డేవిడ్(26) జన గామ రోడ్డులోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. రోజు మాదిరిగానే హోటల్‌కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి గురువారం ఉద యం బయటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న డేవిడ్ మధ్యాహ్నం సమయంలో జనగాం క్రాస్ రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించు స్థానికులు అతడిని అడ్డుకుని పోలీసులకు సమా చారం ఇచ్చారు. అప్పటికే 80శాతం కాలిన అతడిని 108 అంబులెన్సులో స్థానిక ఏరియా ఆసుపత్రి తరలించారు. డేవిడ్ సోదరుడి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డేవిడ్‌కు ఇంకా వివాహం కాలేదు.
Updated Date - 2022-12-16T01:41:26+05:30 IST