ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-10-17T06:33:23+05:30

హైదరాబాద్‌లోని హ స్తినాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడెం మండలం వట్టిపల్లి గ్రామానికి చెం దిన యువకుడు మృతి చెందాడు.

బండి శేఖర్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో విషాదఛాయలు

మర్రిగూడెం, అక్టోబరు 16:  హైదరాబాద్‌లోని హ స్తినాపురంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడెం మండలం వట్టిపల్లి గ్రామానికి చెం దిన యువకుడు మృతి చెందాడు. కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన బండి శేఖర్‌ (22) హైదరాబాద్‌లో ఓ కం పెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మండలంలోని రాజుపేట తం డాకు చెందిన వెంకటంపేట దశరథ ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అతను డాక్టర్‌ను సంప్రదించడంలో ఆలస్యం కావడంతో స్నేహితుడైన శేఖర్‌కు ఫోన చేశా రు. దీంతో అతడిని హస్తినాపురంలో ఉంటున్న తన రూమ్‌కు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఇద్దరూ ఆస్పత్రి నుంచి ద్విచక్ర వాహనంపై హస్తినాపురానికి వెళ్తుండ గా భారీ వర్షం వచ్చింది. దీంతో రోడ్డు పక్కన ద్విచక్ర వాహనాన్ని పార్కు చే స్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. దీంతో శేఖర్‌ అ క్కడికక్కడే మృతి చెందగా దశరథకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మీర్‌పేట పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పో స్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. దశరథ ఉస్మానియా ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శేఖర్‌ మృతితో  ఆయన తల్లిదండ్రులు బండి ముత్యాలు, అలివేలు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. దీంతో వట్టిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   


Updated Date - 2022-10-17T06:33:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising