ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్‌ బస్సుకు తప్పిన ప్రమాదం

ABN, First Publish Date - 2022-08-04T06:14:38+05:30

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడ్డ గోతులను కారు డ్రైవర్‌ తప్పించే క్రమంలో వెనుకనుంచి ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న గోతుల్లోకి దూసుకెళ్లింది.

తూప్రానపేటలో ప్రమాదానికి గురైన స్కూల్‌ బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుంతను తప్పించబోయిన కారు.. కారును తప్పించబోయిన బస్సు

 రోడ్డు పక్కకు గోతిలోకి దూసుకెళ్లిన బస్సు

  విద్యార్థులు క్షేమం

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 3: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఏర్పడ్డ గోతులను కారు డ్రైవర్‌ తప్పించే క్రమంలో వెనుకనుంచి ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సు ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న గోతుల్లోకి దూసుకెళ్లింది. చెట్లు అడ్డంగా ఉండటంతో బస్సు నిలిచిపోయి ప్రమాదం తప్పింది.  చౌటుప్పల్‌ మండలం తూప్రానపేట బుధవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ హయతనగర్‌లో ఉన్న శాంతినికేతన విద్యాసంస్థల పాఠశాల బస్సు చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం వరకు 50మంది విద్యార్థులతో  బయలుదేరింది. కొంత మంది విద్యార్థులు మధ్యలో ఉన్న గ్రామాల్లో దిగారు. తూప్రానపేట వద్దకు బస్సు రాగానే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించబోయింది. అదేసమయంలో వెనుక నుంచి వస్తున్న స్కూల్‌ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో వేగంతో ఉన్న కారు డివైడర్‌ను డీకొట్టి, డివైడర్‌పైకి వెళ్లి ఆగిపోయింది. బస్సు కారును ఢీకొట్టి ఎడమ వైపు దూసుకెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్లను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ సంఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు ఎలాంటి గాయలు కాలేదు. బస్సు డ్రైవర్‌ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా ఈ ప్రమాదంతో జాతీయరహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ట్రాఫిక్‌, పెట్రోలింగ్‌  పోలీసులు క్రేన సహాయంతో వాహనాలను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


Updated Date - 2022-08-04T06:14:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising