తీగల చెరువు.. ఆక్రమణల నెలవు
ABN, First Publish Date - 2022-08-04T05:56:56+05:30
మండల కేంద్రంలోని తీగల్ చెరువుశి ఖం ఆక్రమణదారులకు అడ్డాగా మారింది.
11 ఎకరాలకు పైగా ఆక్రమణలు
హైకోర్టు ఆదేశించినా తొలగించని అధికారులు
నోటీసులతో సరిపుచ్చుతున్న వైనం
మఠంపల్లి, ఆగస్టు 3 : మండల కేంద్రంలోని తీగల్ చెరువుశి ఖం ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. ఐబీ, రెవెన్యూ అధికారులు ఆక్రమణలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బడాబాబులు, రాజకీయనాయకుల దర్జాగా చెరువు భూమిని ఆక్రమించేస్తున్నారు. కొంతమంది పక్కాఇళ్లను నిర్మించుకున్నా రు. దీంతో చెరువు శిక్షం 101.37 ఎకరాలకు గాను ప్రస్తుతం 90 ఎకరాలకే పరిమితమైంది. మండల కేంద్రానికి దగ్గరగా, ప్రధాన కూడలిగా ఉన్న ప్రాంతంలో చెరు వు ఉండటంతో ఇక్కడి భూములు ప్రస్తు తం రూ.కోట్లలో ధర పలుకుతున్నాయి.
మఠంపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 561లో తీగలచెరువు 100ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉండేంది. ఇదిలా ఉండగా హుజూర్నగర్ మండలం లోని అల్లీపురం, అమరవరంతో పాటు పలు తండాలకు, జాన్‌పహాడ్, దామరచర్ల తదితర మండలాల కు వెళ్లే దూరాన్ని తగ్గించేందుకు చెరువు మెరిక భా గం నుంచి రహదారిని నిర్మించి, కట్ట పునర్నిర్మాణం చేపట్టారు. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారు లు చెరువుని ఆక్రమించుకున్నారు. వివిధ కట్టడాలు, బహుళంతస్తుల భవనాలు నిర్మించుకున్నారు. దీంతో 20ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఫీడర్ చానెళ్లు, ఆర్అండ్బీ రహదారిపై ఉన్న కల్వర్టు సైతం మాయం అయ్యాయి.లోతట్టు ప్రాంతంలో మొరం తోలించి స్థిరాస్థి వ్యాపారాలు సైతం చేసుకుంటున్నారు.
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్
మఠంపల్లి తీగల్ చెరువు భూముల ఆక్రమణలపై స్థానికులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో చెర్వు విస్తీర్ణాన్ని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో అప్పటి తహసీల్దార్ సమక్షంలో, ఐబీ అధికారులు హద్దులను ఏర్పాటు చేసి హైకోర్టు సమర్పించారు. మొత్తం 101.37 ఎకరాల్లో చెరువు విస్తీర్ణంగా నిర్ణయించారు. అదే సమయంలో 11ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు నివేదిక అందజేశారు. అధికారుల నివేదికపై విచారణ చేపట్టిన హైకోర్టు చెరువుకు హద్దులు ఏర్పాటు చేయాల ని, శిఖం భూముల్లో అక్రమణ కట్టడాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తహసీల్దా ర్, ఐబీ, రెవెన్యూ అధికారులు సర్వేచేసి చెరువుకు హద్దులు ఏర్పాటుచేశామని, ఆక్రమణ కట్టడాలను తొలగించామని హైకోర్టు, కలెక్టర్లకు తప్పుడు నివేది క అందించారు. స్థానికులు తిరిగి ఫొటోలతో సహా కోర్టుకు సమర్పించడంతో సీరియ్‌సగా తీసుకున్న కోర్టు అప్పటి అధికారులను పిలిచి చివాట్లు పెట్టిన ట్లు సమాచారం. అదే సమయంలో హైకోర్టు ఆదేశాలకు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ఆదేశాలను అమలు చేయని అధికారులకు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో గత నె ల జూలై చెరువు ఆక్రమణలోని 17 మందిలో ఏడుగురికి తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ యాక్ట్ ప్రకారం సెక్షన్ 70,6 నోటీసులను అధికారు లు అందజేశారు. దీంతో వారు స్టే తెచ్చుకునేపనిలో నిమగ్నమయ్యారు.
ఆక్రమణలు గుర్తించినా చర్యలు లేకపోవడంతో..
తీగల చెరువులో ఆక్రమణలపై 2016లో స్థానికు ల ఫిర్యాదుల మేరకు ఐబీ, రెవెన్యూ శాఖలు సం యుక్త సర్వే నిర్వహించి తాత్కలిక హద్దులు ఏర్పా టు చేసి ఆక్రమణలను గుర్తించారు. ఆక్రమణల్లో ఉన్న 17 మందికి నోటీసులూ అందజేశారు. అయి తే ఇప్పటివరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. దీంతో స్థానికులు 2018లో హైకోర్టును, 2021 నవంబరులో లోకాయుక్తను ఆశ్రయించారు. స్పం దించిన లోకాయుక్త ఆక్రమణలపై విచారణ చేపట్టాలని అదే నెల 18న అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబరు 14లోగా నివేదిక ఇవ్వాల్సి ఉండగా, అధికారులు మరో నెల రోజులు గడువు కోరి తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయి నివేదిక ఇవ్వకపోవడంపై అధికారుల తీరును లోకాయుక్త మండిపడినట్లు సమాచారం.
వారంలోగా అక్రమ కట్టడాలను తొలగిస్తాం
హైకోర్టు, లోకాయుక్త, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మఠంపల్లి తీగల్ చెరువు శిఖం భూముల్లో అక్రమణ కట్టడాలను తొలగిస్తాం. ఇప్పటీకే పలుమార్లు రెవెన్యూ సెక్షన్ ప్రకారం సంబంధిత వ్యక్తులకు నోటీసులు అందజేశాం. గతంలో రెవెన్యూ, ఐబీ అధికారుల సర్వే ప్రకారం చెరువు హద్దులు ఏర్పాటుచేస్తాం. హైకోర్టు ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేసి చెరువుకు రక్షణ కల్పిస్తాం.
- సాయిగౌడ్, తహసీల్దార్
Updated Date - 2022-08-04T05:56:56+05:30 IST