ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యానికి పందుల బెడద

ABN, First Publish Date - 2022-11-16T00:46:52+05:30

: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి పందుల బెడద ఏర్పడింది.. పగలూ రాత్రి అనే తేడా లేకుండా పందులు ధాన్యం రాసులను చిందర వందర చేయడంతో పాటుగా తింటున్నాయి.

సూర్యాపేట మార్కెట్‌లో పంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాత్రి వేళల్లో మార్కెట్‌లో కనబడని సెక్యూరిటీ గార్డులు

సూర్యాపేట సిటీ, నవంబరు 15: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యానికి పందుల బెడద ఏర్పడింది.. పగలూ రాత్రి అనే తేడా లేకుండా పందులు ధాన్యం రాసులను చిందర వందర చేయడంతో పాటుగా తింటున్నాయి. పందులు గుంపులు గుంపు లుగా వచ్చి ఒకేసారి ధాన్యం రాసులపై పడి గందరగోళం సృష్టిసు ్తన్నాయి. రాత్రి సమయంలో మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులు కని పించడంలేదు. పందుల బారి నుంచి ధాన్యాన్ని కాపాడుకోవ డానికి రాత్రుల్లో నిద్రాహారాలు మాని పడిగాపులు గాస్తున్నారు. మార్కెట్‌లో మొత్తం 15 మందికి పైగా సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వారిలో 10 మంది రాత్రి వేళల్లో పిల్లలమర్రి, దురాజ్‌పల్లి చెక్‌ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తుండగా మిగతా ఐదుగురు మార్కెట్‌లో రాత్రి సమయంలో విధులు నిర్వహించాలి. అయితే సెక్యూరిటీ గార్డులు రాత్రి తొమ్మిది గంటకే ఇళ్లకు వెళ్లిపోతున్నారని రైతులు ఆరోపి స్తున్నారు. రాత్రి వేళల్లో మార్కెట్‌లో నిఘా పెంచడంతో పాటు సెక్యూరిటీ గార్డులు సరిగా విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుని తమ ధాన్యాన్ని కాపాడాలని రైతులు కోరు తున్నారు.

సెక్యూరిటీ పెంచుతాం

మార్కెట్‌లోకి రాత్రి సమయంలో పందులు వస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. మార్కెట్‌లోకి పందులు వచ్చే అవకాశం లేదు. సంత వైపు గేటును రాత్రి వేళలో మూసివేస్తున్నాం. సెక్యూరిటీని పెంచి, పందులను కట్టడి చేస్తాం.

ఎండీ ఫసియోద్దీన్‌, కార్యదర్శి, సూర్యాపేట

లను ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-11-16T00:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising