మూసీనదిలో పడి పశువుల కాపరి మృతి
ABN, First Publish Date - 2022-05-14T05:30:00+05:30
ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం వలిగొండ మండల కేంద్రానికి చెందిన గొలుసుల
వలిగొండ, మే 14 : ప్రమాదవశాత్తు మూసీనదిలో పడి పశువుల కాపరి మృతి చెందాడు. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం వలిగొండ మండల కేంద్రానికి చెందిన గొలుసుల సమ్మయ్య(40) వృత్తిరీత్యా పశువుల కాపరి. గేదెను సాకుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, వివాహితురాలైన కుమార్తె, అవివాహితుడైన కుమారుడు ఉన్నారు. పనిలో భాగంగా శుక్రవారం పశువులను మేత కోసం మూసీ నది పరివాహక ప్రాంతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు మూసీ నది నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. రాత్రి వరకు సమ్మయ్య ఇంటికి రాకపోయే సరికి కుటుంబసభ్యులు చుట్టపక్కల బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకుండాపోయింది. సమీప బంధువు వరుసకు సోదరుడు నర్సింహ శనివారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్‌ఐ ప్రభాకర్ తన సిబ్బందితో స్థానిక యువకులతో మూసీనదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గజఈతగాళ్లు మూసీనదిలో గాలింపు చర్యలు చేపట్టగా మధ్యహ్నం 2.55గంటలకు సమ్మయ్య మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహం వెలికి తీయగానే కుటుంబసభ్యుల, బంధువుల రోదనలతో పలువురు కన్నీరుపెట్టారు.
Updated Date - 2022-05-14T05:30:00+05:30 IST