Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత
ABN, First Publish Date - 2022-10-17T13:45:46+05:30
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు(Nagarjunasagar Project) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా
Nalgonda: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు(Nagarjunasagar Project) వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ఫ్లో 2,53,240 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ఫ్లో 2,52,957 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 588 అడుగులుగా కొనసాగుతోంది.
Updated Date - 2022-10-17T13:45:46+05:30 IST