ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mutton low price: తక్కువ ధరకే మటన్.. ఎగబడిన జనం

ABN, First Publish Date - 2022-09-25T23:35:14+05:30

ఏదైనా వస్తువు తక్కువ ధరకు వస్తుందంటే చాలు జనాలకు ఎక్కడి లేని ఆశ కలుగుతుంది. వెంటనే అక్కడి వెళ్లిపోయి దానిని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆలస్యమైనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏదైనా వస్తువు తక్కువ ధరకు వస్తుందంటే చాలు జనాలకు ఎక్కడి లేని ఆశ కలుగుతుంది. వెంటనే అక్కడికి వెళ్లిపోయి దానిని తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఆలస్యమైనా సరే దానిని కొనుగోలు చేస్తారు. అలాంటిది మాంసం తక్కువ ధరకు వస్తుందంటే.. జనాలు ఇక ఆగతారా...? పరుగెత్తికెళ్లి దానిని కొని రుచి చూసే వరకు నిద్రపోరు. అది ఆదివారం అయితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఆ మాంసం దుకాణాన్ని చుట్టుముట్టేస్తారు. బారులు తీరి తెచ్చుకుంటారు. 


ఇలాంటి ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో తక్కువ ధరకే మటన్ దొరుకుతుండటంతో ప్రజలు ఎగబడ్డారు. ఆదివారంకావడంతో మటన్ కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. కిలో మాంసం రూ. 400కే దొరుకుతుండటంతో ప్రజలు భారీగా కొనుగోలు చేశారు. ఇవాళ పెద్దల అమావాస్య కావడంతోనూ మటన్ సెంటర్ దగ్గర భారీగా జనం గుమిగూడారు. మూడు గంటల పాటు జనాలు క్యూలైన్లలో నిలబడి మాంసాన్ని తీసుకెళ్లారు. అయితే వారిని మాంసం ప్రియులను కట్టడి చేసేందుకు చివరకు పోలీసులు రంగప్రవేశం చేసే పరిస్థితి వచ్చింది. 


అయితే తక్కవ ధరకే వస్తుందని మాంసం తినకూడదని.. అది నాణ్యమైనదేనా..? కాదా అనేది తెలుసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులు అంటున్నారు. నాణ్యత లేని మాంసం తిని అనారోగ్యం పాలుకావొద్దని సూచిస్తున్నారు. 



Updated Date - 2022-09-25T23:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising