ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా

ABN, First Publish Date - 2022-01-16T23:16:46+05:30

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా మొదటి వేవ్‌లో ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి కావడం గమనార్హం. అప్పుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముత్తిరెడ్డి సతీమణి, గన్‌మెన్, వంటమనిషి, డ్రైవర్‌కు కరోనా సోకింది.


మరోవైపు శరవేగంగా వ్యాపించే ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. దీని స్వభావం రీత్యా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 30 శాతం జనాభాకు వైర్‌స సోకే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. సంక్రాంతి తర్వాత కేసులు పెద్దసంఖ్యలో వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఆస్పత్రులను సంసిద్ధం చేస్తోంది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. 


Updated Date - 2022-01-16T23:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising