ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగాలి

ABN, First Publish Date - 2022-05-15T08:50:57+05:30

డిగ్రీలు పొందిన విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించే వారిగా ఎదగాలన్న ఆకాంక్షను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య 

రాజేంద్రనగర్‌, మే 14(ఆంధ్రజ్యోతి): డిగ్రీలు పొందిన విద్యార్థులు ఉద్యోగాల కోసం కాకుండా వాటిని సృష్టించే వారిగా ఎదగాలన్న ఆకాంక్షను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌)లో శనివారం నిర్వహించిన 4వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. పరిశ్రమలు నెలకొల్పి ఆత్మ నిర్భర్‌భారత్‌ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు  పిలుపునిచ్చారు. ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనం నేడు 50 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల విలువైన ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. శాస్త్రవేత్తలు  స్థానిక భాషలోనే  రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయాలన్నారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో స్నాతకోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2017 నుంచి 2022 వరకు నాలుగు బ్యాచ్‌లకు చెందిన 163 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. 

Updated Date - 2022-05-15T08:50:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising