Hyderabad: చార్మినార్‌లో రౌడీషీటర్ హత్య
ABN, First Publish Date - 2022-10-07T12:49:02+05:30
రెయిన్‌బజార్ రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. భవానీ నగర్ ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. రెయిన్‌బజార్‌కు చెందిన సయ్యద్
హైదరాబాద్/చార్మినార్: రెయిన్‌బజార్ రౌడీ షీటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. భవానీ నగర్ ఇన్‌స్పెక్టర్ అంజద్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. రెయిన్‌బజార్‌కు చెందిన సయ్యద్ మహమ్మద్ భక్తియార్ ఆగా ఖురేషి పలు కేసుల్లో నిందితుడు. ఇతడిపై రౌడీ షీట్ నమోదై ఉంది. ఖురేషీ బుధవారం ఉదయం ఈదీ బజార్ అన్మోల్ హోటల్ వెనుక భాగంలో నిలబడి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన భక్తియార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షలు, లేక ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-10-07T12:49:02+05:30 IST