ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugodu By Election: టీజేఎస్ మద్దతు కోరిన కాంగ్రెస్

ABN, First Publish Date - 2022-08-17T01:34:02+05:30

మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypoll) జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ నేతలు టీజేఎస్ మద్దతు కోరారు. టీజేఎస్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): మునుగోడు ఉపఎన్నిక (Munugodu Bypoll) జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ (Congress) నేతలు టీజేఎస్ మద్దతు కోరారు. టీజేఎస్ (Tjs) కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, ఈరవర్తి అనిల్, విజయరమణరావు..  ఆ పార్టీ చీఫ్ కోదండరాం (Kodandaram)ను కలిశారు. మునుగోడు ఉప‌ఎన్నికల్లో టీజేఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. షెడ్యూల్ వచ్చే వరకు వేచి చూసే ఆలోచనలో‌ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఉన్నట్లు తెలుస్తోంది. 



ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Tpcc Working President Mahesh Kumar) మీడియాతో మాట్లాడతూ మునుగోడు ఉప ఎన్నికలెప్పడు వచ్చినా మద్దతు ఇవ్వాలని కోదండరాంను కోరామని చెప్పారు. పార్టీలో చర్చించి నిర్ణయం చెప్తామని కోదండరాం చెప్పినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌తో కలిసొచ్చే అన్ని పార్టీల మద్దతు కోరతామన్నారు. లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే బీజేపీ, టీఆర్ఎస్‌లు ఉప ఎన్నికకు ప్లాన్ చేశాయని చెప్పారు. 


‘‘ఎనిమిదేళ్ళ టీఆర్ఎస్ అరాచక‌ పాలనను అంతమెందిస్తాం. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదనే అందరి మద్దతు కోరుతున్నాం.’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 


పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) మాట్లాడుతూ మునుగోడులో కాంగ్రెస్ గెలవటం చారిత్రాత్మక అవసరమన్నారు. ‘‘బీజేపీ, టీఆర్ఎస్ లను మినహాయించి అన్ని పార్టీల మద్దతు కోరుతాం. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించటానికి అందరూ కలసి రావాలి.’’ అని మల్లు రవి పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-08-17T01:34:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising