ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugodu bypoll: టీఆర్‌ఎస్‌కు మద్దతుపై సీపీఐ స్పష్టత

ABN, First Publish Date - 2022-08-20T18:49:05+05:30

మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ స్పష్టతనిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మునుగోడులో టీఆర్‌ఎస్‌ (TRS)కు మద్దతు ఇచ్చే అంశంపై సీపీఐ (CPI) స్పష్టతనిచ్చింది. మునుగోడు ఉపఎన్నిక (Munugodu by poll)లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి (Chada venkat reddy) ప్రకటించారు. ఈరోజు మునుగోడులో జరిగే టీఆర్ఎస్ బహిరంగ సభకు రావాలని కేసీఆర్ (KCR) కోరినట్లు తెలిపారు. సీపీఐ తరపున పల్లా వెంకట్ రెడ్డి(Venkat reddy)... కేసీఆర్ (CM KCR) సభలో పాల్గొంటారన్నారు. ప్రగతిశీల రాజకీయాలకు కేసీఆర్ కంకణబద్ధుడై ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్‌తో కలిసివెళ్తామని స్పష్టత నిచ్చారు. అనివార్యంగా మునుగోడు ఉప ఎన్నిక తెరపైకి వచ్చిందన్నారు. తన స్వార్థ ప్రయోజనం కోసం రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) రాజీనామా చేశారని ఆయన విమర్శించారు.


అందుకే ప్రజలపై ఉప ఎన్నిక రుద్దబడిందన్నారు. నేటి రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఫాసిస్ట్ బీజేపీ(BJP)నీ ఓడించడానికి బలమున్న పార్టీకి మద్దతు ఇవ్వాలనుకున్నట్లు నేతలు వివరించారు. బాధ్యతాయుతమైన పార్టీగా మతతత్వ పార్టీనీ ఓడించే పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు. కాంగ్రెస్ (Congress) పరిస్థితి, క్రేడిబిలిటి, ఉనికిపై మాట్లాడదలచుకోలేదన్నారు. తాము ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ విభజన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు. బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-20T18:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising