ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghunandan Rao: మునుగోడులో సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు

ABN, First Publish Date - 2022-08-21T23:08:04+05:30

బీజేపీ (Bjp) బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghunandan Rao) హాజరయ్యారు. ఈ సందర్బంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు (Munugodu): బీజేపీ (Bjp) బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghunandan Rao) హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ (Trs), సీపీఐ (Cpi), సీపీఎం (Cpm)పై విమర్శలు చేశారు. సీపీఐ, సీపీఎంలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వెంట ఉంటాయన్నారు. మునుగోడులో బీజేపీ సభ జరగకుండా  సీఎం కేసీఆర్ కుట్ర చేశారని రఘునందన్ చెప్పారు. ఆదివారం సెలవని.. ప్రభుత్వ కార్యక్రమాలు ఉండవని.. తమ సభకు ప్రజలను రానివ్వకుండా ఉండేందుకు కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారని రఘునందన్ ఆరోపించారు.


‘‘ఆదివారం ఉపాధి హామీ పనులు ఉండవు. కాని వారందరికి పంచాయతీ కార్యాలయాలకు పిలిపించారు. కొత్త రేషన్ కార్డులు, అసరా పింఛన్లు ఇస్తామని మునుగోడు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల వద్దకు ప్రజలను టీఆర్ఎస్ సర్పంచులు తీసుకెళ్లారు. ఇదీ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. బీజేపీ గెలిస్తే వ్యవసాయానికి విద్యుత్ మోట్లార్లు వస్తాయని విష ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెట్టాలని పార్లమెంట్‎లో బిల్లు పాస్ అయింది. జీవో ఇచ్చారా..?. అనే ప్రశ్నలపై సీఎం కేసీఆర్ చర్చకు సిద్ధమా.?  నవంబర్ 10, 2020లో దుబ్బాక ఎన్నిక జరిగింది. ఆ సమయంలో పైసల మంత్రి హరీశ్ రావు కూడా ఇదే దుష్ప్రచారం చేశారు. ఆ ఎన్నికలో నేను గెలిచాను. వ్యవసాయ మోటర్లకు విద్యుత్ మీటర్లు వచ్చాయా..?. హుజారాబాద్‎లో కూడా ఇలానే చెప్పారు. ప్రజలు నమ్మలేదు.. మా ఈటల రాజేందర్‌ను శాసనసభకు పంపారు. 2018లో వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.  అభివృద్ధి చేయలేదు. 2018లో మునుగోడును చాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకూ అటువైపే చూడలేదు. అప్పుడు వేములవాడ రాజన్నను ముంచినట్టే.. ఇప్పుడు మునుగోడులో మా రాజన్నను ముంచే ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక దుబ్బాక, హుజురాబాద్‌కు భిన్నంగా జరగాలి.’’ అని రఘునందన్ రావు పిలుపు నిచ్చారు. 



Updated Date - 2022-08-21T23:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising