ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Etela Rajender: ఏనాడైనా ప్రగతి భవన్‎లో అడుగుపెట్టారా?.. సీపీఐ, సీపీఎం నేతలకు సూటి ప్రశ్న

ABN, First Publish Date - 2022-08-21T23:37:17+05:30

టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చాలా కాలంగా తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు (Munugodu): టీఆర్ఎస్ ప్రభుత్వం పోవాలని చాలా కాలంగా తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నారని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Bjp Mla Etela Rajender) అన్నారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘హుజూరాబాద్ (huzurabad) కంటే కూడా మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అని అన్నారు. 


ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)ని గెలిపించి.. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా బీజేపీని గెలపిస్తామనే నమ్మకాన్ని మునుగోడు ప్రజలు ఇప్పటికే కలిగించారని ఈటల చెప్పారు. మునుగోడు సభకు వస్తానని కేంద్రమంత్రి అమిత్ షా (Central Minister Amit Shah) వస్తానని చెప్పారని.. మళ్లీ వచ్చే ఎన్నికలప్పుడు కూడా వస్తానని మాట ఇచ్చారని ఈటల తెలిపారు. ఈ సభ విజయవంతం కాకూదనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ శనివారం టీఆర్ఎస్ (Trs) సభ నిర్వహించారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే కేసీఆర్‎ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసే అస్కారం ఉందని ఆయనే చెప్పుకున్నారని చెప్పారు. 


‘‘ప్రపంచ పాలకుల్లోనే అందరికంటే ప్రజల ప్రేమను పొందిన నాయకుడు ప్రధాని మోదీ. గత ఏడు, 8 నెలల్లో సీపీఐ (Cpm), సీపీఎం (Cpm)పార్టీ నాయకులు ఏనాడైనా ప్రగతి భవన్‌ (Pragati Bhavan)లో అడుగుపెట్టారా?. ట్రేడ్ యూనియన్లు సమ్మె చేస్తే సీపీఎం, సీపీఐ నాయకులతో సీఎం కేసీఆర్ ఒక్కసారైనా చర్చ జరిపారు. ఆ సమస్యలు పరిష్కరించారా?.’’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.  




Updated Date - 2022-08-21T23:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising