ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode By-election: టీఆర్ఎస్‌ ప్రజాదీవెన సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన కేసీఆర్‌

ABN, First Publish Date - 2022-08-20T21:36:09+05:30

మునుగోడు (Munugode)లో టీఆర్ఎస్‌ (TRS) ప్రజాదీవెన సభ ప్రారంభమైంది. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: మునుగోడు (Munugode)లో టీఆర్ఎస్‌ (TRS) ప్రజాదీవెన సభ ప్రారంభమైంది. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆవిష్కరించారు. వేదికపై అమరవీరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ నుంచి 5వేల కార్లతో భారీ ర్యాలీగా మునుగోడుకు చేరుకున్నారు. లక్ష మందితో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఈ సభా వేదిక నుంచే సీఎం వరాల జల్లు కురిపిస్తారని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఉన్నారు.


సీఎం సభకు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, రెండు మునిసిపాలిటీల నుంచి సుమారు 80వేల మందిని తరలించేందుకు ముందుగానే ప్రణాళిక రూపొందించారు. మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలకు బాధ్యత కేటాయించారు. మునుగోడుకు పరిసరాల్లోని నకిరేకల్‌, నల్లగొండ, దేవరకొండ నియోజకవర్గాల నుంచి 20వేల మందిని తరలించాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన వాహనాలను స్థానికంగా సమకూర్చుకున్నారు. వాహనాల కొరత ఏర్పడటంతో హైదరాబాద్‌ నుంచి మరికొన్ని రప్పించారు. మునుగోడు ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని 40ఎకరాల విస్తీర్ణంలో సభకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు పూర్తిచేసింది. సభా ప్రాంగణం కారణంగా పత్తి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.60వేల చొప్పున అడ్వాన్స్‌గా రూ.18లక్షలు చెల్లించారు.

Updated Date - 2022-08-20T21:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising