ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode By-election: ఫ్లోరైడ్‌ రక్కసిని కేసీఆర్‌ పారదోలారు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-08-20T21:53:53+05:30

2014కు ముందు మునుగోడు (Munugode) లో దీన పరిస్థితులు ఉండేవని, ఎడారిలాంటి నల్లగొండ జిల్లాను సీఎం కేసీఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు: 2014కు ముందు మునుగోడు (Munugode) లో దీన పరిస్థితులు ఉండేవని, ఎడారిలాంటి నల్లగొండ జిల్లాను సీఎం కేసీఆర్‌ (CM KCR) సస్యశ్యామలంగా మార్చారని మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadish Reddy) కొనియాడారు. మునుగోడులో టీఆర్ఎస్‌ (TRS) ఆధ్వర్యంలో ప్రజాదీవెన సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్‌ రక్కసిని కేసీఆర్‌ పారదోలారని తెలిపారు. గతంలో కేసీఆర్‌ ఎక్కడికెళ్లినా జిల్లా ఫ్లోరైడ్‌ గురించే చెప్పేవారని, నల్లగొండకు ఏదైనా చేస్తే ముందు ఫ్లోరైడ్‌ నివారణే అన్నారని జగదీష్‌రెడ్డి గుర్తుచేశారు. 


మతోన్మాదమే బీజేపీ అజెండా అని సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. ‘‘కేసీఆర్‌ దేశ రాజకీయాలపై వామపక్షాలతో చర్చించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎన్నికలు వేరు, రాజకీయ పోరాటం వేరు. రాజగోపాల్‌రెడ్డిని ముందు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. మునుగోడు సమస్యలన్నీ కేసీఆర్‌కు తెలుసు. మేం ఎవరికి మద్దతు ఇచ్చినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపలేదు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయానికి సహకరిస్తాం’’ అని పల్లా వెంకట్‌రెడ్డి ప్రకటించారు.


Updated Date - 2022-08-20T21:53:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising