ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode by-election: మునుగోడుపై బీజేపీ జాతీయ నాయకత్వం పోకస్

ABN, First Publish Date - 2022-08-18T21:40:55+05:30

మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election)పై బీజేపీ జాతీయ నాయకత్వం పోకస్ పెట్టింది. రాష్ట్రానికి బీజేపీ జాతీయ సంస్థాగత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక (Munugode by-election)పై బీజేపీ జాతీయ నాయకత్వం పోకస్ పెట్టింది. రాష్ట్రానికి బీజేపీ జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రానున్నారు. శుక్రవారం బీజేపీ ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. దుబ్బాక, హుజురాబాద్‌ (Dubbaka Huzurabad) ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. అయితే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ (BJP) అభ్యర్తి ఓడిపోయారు. అందువల్ల ఈ సారి మునుగోడులో గెలిచి దక్షిణ తెలంగాణలో సత్తా చాటాలని బీజేపీ భావిస్తున్నారు. అందువల్లే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మరి ఎన్నికల్లో దిగుతున్నారు. మునుగోడులో గెలిచి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా తమదే విజయమనే సంకేతాన్ని బీజేపీ నేతలు పంపాలని అనుకుంటున్నారు. అందుకోసం వ్యూహాత్మకంగా కామలనాథులు ముందుకుపోతున్నారు.


కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులందరితో టచ్‌లో ఉన్న రాజగోపాల్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అమిత్‌షా సభ రోజు భారీగా చేర్చుకునేందుకు వ్యూహం సిద్ధం చేశారు. అధికార పార్టీలో అసమ్మతితో రగిలిపోతున్న నేతలను తన టచ్‌లో ఉంచుకున్నారు. పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఖరారవుతారన్న సమాచారంతో అసంతృప్త నేతలు ఓ వైపు రాజగోపాల్‌రెడ్డి, మరోవైపు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్తున్నారు. ఆ వలసలను ఆపే క్రమంలో అధికార టీఆర్‌ఎస్‌ కేసులు, అరెస్టుల వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో అప్రమత్తమైన అసంతృప్త నేతలు అమిత్‌షా సభ వరకు వేచి చూడకుండా కమలం కండువా కప్పుకుంటున్నారు. చండూరు మండలానికి చెందిన ఐదుగురు టీఆర్‌ఎస్‌ (TRS) ప్రజాప్రతినిధులు బుధవారం చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ (Etala Rajender) చేతుల మీదుగా కండువాలు కప్పుకున్నారు. వీరు పార్టీని వీడుతున్నారన్న సమాచారం మంత్రికి తెలియడంతో ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభం కావడంతో, ఆ ఐదుగుకు హుటాహుటిన కమలం గూటికి చేరిపోయారు. అమిత్‌షా సభ రోజు భారీగా చేరికలను చూపించి రాజగోపాల్‌రెడ్డి తన ఇమేజ్‌ను చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు.

Updated Date - 2022-08-18T21:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising