ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Munugode bye-election: మునుగోడు కాంగ్రెస్కు బలమైన నియోజకవర్గం: భట్టి

ABN, First Publish Date - 2022-09-18T22:07:45+05:30

మునుగోడు (Munugode)లో కాంగ్రెస్ (Congress) బూత్ స్థాయి ఇన్ఛార్జ్లతో సీఎల్సీ నేత భట్టి విక్రమార్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: మునుగోడు (Munugode)లో కాంగ్రెస్ (Congress) బూత్ స్థాయి ఇన్ఛార్జ్లతో సీఎల్సీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలు డబ్బుకు లొంగరని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై అడుగులు వేస్తూ.. డబ్బులతో రాష్ట్రంపై దాడి చేయడానికి బీజేపీ వస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం, డబ్బు, మద్యంతో మునుగోడు ప్రజలను కొనాలని చూస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రతి గడపకు పరిచయమని తెలిపారు. మునుగోడు ప్రజలు వేసే ఓటు మీదే.. రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినరేనని భట్టి విక్రమార్క తెలిపారు. 


సుదీర్ఘ కసరత్తు అనంతరం ఢీల్లీ కాంగ్రెస్‌ పెద్దలు మునుగోడు అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి (palvai sravanti)ని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పోరు మూడు పార్టీల మధ్యే ఉండనుంది. అయితే అభ్యర్థుల అధికారిక ప్రకటన విషయంలో కాంగ్రెస్‌ ఒక అడుగు ముందుకేసింది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఖరారవుతారన్న ప్రచారం ఉంది. ఆ మేరకు వారే నియోజకవర్గంలో ముందుండి పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆయా పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాజగోపాల్‌ రాజీనామా చేసిన వెంటనే బహిరంగ సభల నిర్వహణలోనూ కాంగ్రెసే ముందు నడిచింది. 


మునుగోడు నియోజకవర్గంలో 12సార్లు ఎన్నికలు జరగ్గా ఆరు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఐదుసార్లు పాల్వాయి స్రవంతి తండ్రి గోవర్ధన్‌రెడ్డి విజయం సాధించగా, ఒకసారి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారు ఉన్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన నలుగురి పేర్లతో పార్టీ స్థానికంగా సర్వే చేయించగా 20శాతం మంది స్రవంతి వైపు ఉండగా మిగిలిన వారిలో కొంత మందికి 3శాతం, మరికొంత మందికి 1శాతం మందే అనుకూలంగా సమాధానం ఇవ్వడంతో స్రవంతి అభ్యర్థిత్వం వైపు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపినట్లు సమాచారం.

Updated Date - 2022-09-18T22:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising