ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ సీఐడీ నోటీసులపై ఎంపీ Raghurama స్పందన

ABN, First Publish Date - 2022-01-12T17:01:11+05:30

ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన నోటిసులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ సీఐడీ అధికారులు జారీ చేసిన నోటిసులపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. బుధవారం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ... ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ నెల 17 సీఐడీ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. గత కేసుల్లో మరిన్ని వివరాలు తీసుకునేందుకు రావాలన్నారని తెలిపారు. పండగ సమయంలోనే విచారణకు ఎందుకు పిలిచారో అని ప్రశ్నించారు.  ‘‘నేను చట్టాలను అనుసరిస్తాను... గతం లో నన్ను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు లేకుండా చేశారు.. నా సిబ్బందిపై, నా పై వ్యక్తి గతంగా దాడి చేశారు’’ అని అన్నారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన వివరాలు సమర్పించానని అన్నారు. ఈ రావణ రాజ్యంలో ప్రజలు విసుగుచెందారని అన్నారు. రోడ్లు వేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మండిపడ్డారు. సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది అని.... ఇదంతా చూసి ముఖ్యమంత్రి జగన్ ఆనంద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజు తప్పులను ప్రశ్నిస్తే రాజద్రోహమా అని నిలదీశారు. జగన్‌రెడ్డిది ఆటవిక పాలన అని ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు చేశారు. 


Updated Date - 2022-01-12T17:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising