ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈసారి బడ్జెట్‌లో ఇళ్లకు మరిన్ని నిధులు?

ABN, First Publish Date - 2022-03-05T07:15:45+05:30

గత బడ్జెట్‌లో మాదిరిగా కాకుండా ఈ సారి ఇళ్ల నిర్మాణానికి నిధుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గత బడ్జెట్‌లో మాదిరిగా కాకుండా ఈ సారి ఇళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపును పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్‌లో రోడ్లకు పెంచి, ఇళ్లకు తగ్గించారు. ఈ సారి అలాకాకుండా రెండింటికీ పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖకు రోడ్లు, హౌసింగ్‌ శాఖ అధికారులు బడ్జెట్‌ ప్రతిపాదనలు సైతం పంపించినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.


గత బడ్జెట్‌లో రోడ్లకు రూ.8,788 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ. 8,738 కోట్ల కేటాయింపులు చేశారు. కాగా, 2020-21 బడ్జెట్‌ కేటాయింపులు పరిశీలిస్తే... రోడ్లకు రూ. 3,493 కోట్లు కేటాయించగా, హౌసింగ్‌ శాఖకు మాత్రం రూ.11,916 కోట్లు ఇచ్చారు. అంటే రోడ్లకు అంతకుముందు కంటే గతేడాది రూ. 5,295 కోట్లు నిధులు పెంచారు. అదే సమయంలో ఇండ్లకు రూ.3,178 కోట్లు తగ్గించారు. దీని ప్రభావం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై పడిందని హౌసింగ్‌ అధికారులు చెబుతున్నారు.  


Updated Date - 2022-03-05T07:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising