ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi phone Sharmila: షర్మిలకు మోదీ ఫోన్‌

ABN, First Publish Date - 2022-12-07T03:19:57+05:30

తెలంగాణ రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఫోన్‌ చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా ఆహ్వానం

హైదరాబాద్‌లో కారు టోయింగ్‌ ఘటనపై ఆరా

సానుభూతి.. అండగా ఉంటామని భరోసా!.. 10 నిమిషాల పాటు సంభాషణ

జగన్‌ను ప్రశ్నించిన మర్నాడే షర్మిలకు ఫోన్‌ చేయడంతో రాజకీయ ప్రాధాన్యం

న్యూఢిల్లీ, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు ఫోన్‌ చేశారు. దాదాపు 10 నిమిషాలపాటు ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లో షర్మిల పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు, అందుకు దారితీసిన పరిణామాలు, ఆమె చేస్తున్న కార్యక్రమాలు, పాదయాత్రతోపాటు తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారని వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. జరిగిన ఘటన పట్ల షర్మిలకు ప్రధాని సానుభూతి తెలిపారని, మహిళ అని కూడా చూడకుండా కారులో ఉండగానే ఆమెను తీసుకెళ్లడం దారుణమని ఆయన అన్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని, తాము అండగా ఉంటామని, ఆమెకు భరోసా ఇచ్చినట్లు తెలిపాయి. అంతేకాకుండా.. ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా షర్మిలను ప్రధాని ఆహ్వానించినట్లు పేర్కొన్నాయి.

ఇటీవల నర్సంపేటలో షర్మిల పాదయాత్రను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకొని దాడి చేయడం, ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించడంతో.. ఇందుకు నిరసనగా ప్రగతి భవన్‌ వద్ద ఆందోళన చేసేందుకు షర్మిల వెళుతుండగా.. కారు లోపల ఆమె ఉండగానే కారును టోయింగ్‌ వాహనంతో పోలీ్‌సస్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీలో జీ-20 సదస్సు నిర్వహణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఏపీ సీఎం, షర్మిల సోదరుడు వైఎస్‌ జగన్‌ను తేనేటి విందు సమయంలో మోదీ ఈ విషయంపై ప్రశ్నించారు. ‘‘మీ చెల్లెలు షర్మిల లోపల ఉండగానే ఆమె కారును టోయింగ్‌ వాహనంతో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారట కదా! ఇంత జరిగినా మీరెందుకు స్పందించలేదు?’’ అని జగన్‌ను మోదీ ప్రశ్నించగా.. జగన్‌ తనదైన శైలిలో నవ్వుతూ మౌనంగా ఉండిపోవడం తెలిసిందే. సోదరికి జరిగిన అవమానం పట్ల వైఎస్‌ జగన్‌ను ప్రశ్నించినా స్పందించకపోవడంతో.. ప్రధాని స్వయంగా షర్మిలకు ఫోన్‌ చేశారు. జగన్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించిన మరుసటి రోజే షర్మిలకు ఫోన్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-12-07T04:11:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising