ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంజయ్‌కి మోదీ ఫోన్

ABN, First Publish Date - 2022-01-08T22:46:52+05:30

ప్రధాని మోదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ వచ్చింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను మోదీ అడిగి తెలుసుకున్నారు. ఈనెల రెండవ తేదీన జగ జాగరణ దీక్ష తదనంతరం జరిగిన పరిస్థితులను మోదీకి  సంజయ్ వివరించారు.మోదీని రాష్ట్రానికి రావాలని సంజయ్ ఆహ్వానించారు. మీ ఆశీర్వాదంతో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని మోదీకి సంజయ్ చెప్పారు. 317జీవోపై మోదీ ఆరా తీశారు. వ్యక్తిగతంగా సంజయ్‌పై దాడి చేయడానికి కారణాలు ఏంటని  మోదీ ప్రశ్నించారు.


దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల విజయాలను  మోడీ ప్రస్తావించాడు. సంజయ్ పోరాటాన్ని ప్రధాని మెచ్చుకున్నారు. ప్రజాసమస్యలపై ఎన్నిసార్లు జైలుకు వెళ్ళిన తప్పులేదన్నారు. ఎంపీ కార్యాలయంపై దాడిని మోదీ ఖండించారు. కార్యాలయంలోకి వచ్చి ఎలా దాడిచేస్తారని ఆరా‌ తీశారు. సంజయ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయాలపా‌లైన కార్యకర్తలకు అండగా ఉందామని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలని, మీకు అన్ని విధాలా అండగా ఉంటామని మోడీ హామీ ఇచ్చారు.



 ఇప్పటికే సంజయ్‌ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పరామర్శించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు, చత్తీస్‌గడ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  రాష్ట్రానికి వచ్చి సంజయ్‌ని పరామర్శించారు. సంజయ్‌కి  జాతీయ నాయకత్వం పూర్తి మద్దుతుగా నిలిచింది. కేసీఆర్‌పై పోరు కొనసాగించటానికి  జాతీయ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Updated Date - 2022-01-08T22:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising