ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదు: జగదీష్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-07-25T00:35:58+05:30

Hyderabad‌: మంత్రి జగదీష్‌రెడ్డి ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదని అన్నారు. తల్లిపాలపై తప్ప అన్నింటిపై మోదీ పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బిజీగా ఉండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad‌: మంత్రి జగదీష్‌రెడ్డి (Jagadeesh Reddy) ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ పన్నుల ప్రధాని..పనుల ప్రధాని కాదని అన్నారు. తల్లిపాలపై తప్ప అన్నింటిపై మోదీ (PM Modi) పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాలు, కాంట్రాక్టుల్లో బిజీగా ఉండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Ragagopal Reddy) నియోజకవర్గాన్ని మర్చిపోయారని పేర్కొన్నారు.  కోమటి రెడ్డి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి స్పందించారు.


కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.  ఇటీవల ఆయన అమిత్ షాను కలవడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దెదించే పార్టీలో చేరుతానని గతంలో ఆయన ప్రకటించారు. అయితే ఏ పార్టీ అనే దానిపై స్పష్టంగా చెప్పలేదు.  ఆదివారం హైదరబాదులో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపంచారు. పార్టీ కార్యకర్తలతో చర్చించకుండా ఏ నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. TRS  నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే రాజీనామా చేసేందుకు సిద్ధమేనని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-25T00:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising