ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణపై మోదీకితొలి నుంచీ ద్వేషమే

ABN, First Publish Date - 2022-02-10T06:54:18+05:30

తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్రాన్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు
  • తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి: రేవంత్‌
  •   


హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపాయి. మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశాయి.మోదీ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్‌ వల్లే సాధ్యమైందన్న విషయం ఆయన మాటలతో స్పష్టమైందన్నారు. తెలంగాణపై బీజేపీ.. తొలి నుంచీ ద్వేష భావంతోనే ఉందని, మోదీ మాటలతో అది మరోసారి నిజమైందని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా, వారి త్యాగాలను కించపరిచేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని, తెలంగాణ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.


తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌, బీజేపీలు చేసింది శూన్యమన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని, తెలంగాణపై ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని, కానీ.. మోదీ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలను ఒకలా.. దక్షిణాది రాష్ట్రాలను మరోలా చూస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణపై మోదీ అక్కసు వెళ్లగక్కినా.. సీఎం కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా కృషి చేసిందో ప్రధాని మరొక్కసారి గుర్తు చేశారని తెలిపారు. కాంగ్రెస్‌ ఆలస్యం చేయడం వల్లే 12 వందల మంది చనిపోయారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు వ్యాఖ్యానించడం దారుణమన్నారు. తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్‌ జరిగిన రోజు కేసీఆర్‌.. అసలు పార్లమెంటుకే రాలేదని గుర్తు చేశారు.


తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు తప్పుబట్టారు. రాహుల్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఆయన అలా మాట్లాడారన్నారు. రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా మోదీ నెరవేర్చలేదని, జాతీయ సంపదను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలు చూస్తుంటే భయమేస్తోందని, తెలంగాణను మళ్లీ ఆంధ్రలో కలిపేస్తారేమోనన్న అనుమానం కలుగుతోందని చిన్నారెడ్డి విమర్శించారు. ఏపీని విభజించి రెండుచోట్లా కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిందని మోదీ అనడం హాస్యాస్పదమని, బీజేపీ ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేదని తెలిపారు.


తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. అప్పట్లో బీజేపీ కూడా తెలంగాణకు మద్దతు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి చేయూతనివ్వాల్సిన ప్రధాని, ఇలా కించపరిచేలా మాట్లాడడం భావ్యం కాదని చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ నేటికీరాలేదని, ఇందుకు బీజేపీ బాధ్యత వహించాలని అన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు శూన్యహస్తం చూపిన మోదీ.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే టీఆర్‌ఎ్‌సతో కలిసి నాటకాలు ఆడుతున్నారని, ఈ క్రమంలోనే కొత్త వివాదాలను తెరపైకి తెస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ విమర్శించారు. ఇదొక పెద్ద డైవర్షన్‌ స్కీం అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా.. సీఎం కేసీఆర్‌ ఏనాడూ విభజన హామీల గురించి అడగరని, పైగా లోలోపల బీజేపీకి సహకరిస్తారని అన్నారు. రాష్ట్ర విభజన తీరును తప్పు పట్టడం సిగ్గు చేటని టీపీసీసీ పీఏసీ చైర్మన్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు సిగ్గుంటే వెంటనే మోదీతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్‌ చేశారు.


కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని మోదీ.. పదే పదే అవమానిస్తున్నారని టీజేఎస్‌ అధినేత కోదండరాం అన్నారు. మోదీ వ్యాఖ్యలతో సుష్మా స్వరాజ్‌ ఆత్మ ఘోషిస్తుందన్నారు. తెలంగాణ పట్ల ప్రధానికి నిజంగా చితశుద్థి ఉంటే.. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, జనగామలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌ నాయకులను బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. దీంతో.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో 9 మంది బీజేవైఎం కార్యకర్తలు గాయపడ్డారు. 





మోదీ తెలంగాణ శత్రువు


సోషల్‌ మీడియాలో నిరసనల వెల్లువ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పాటును ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాని వ్యాఖ్యలను తప్పుబడుతూ అధికార టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మరోపక్క సోషల్‌ మీడియాలో ప్రధాని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేకనే ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణకు వ్యతిరేకంగా గతంలో మోదీ మాట్లాడిన వీడియోలను షేర్‌ చేవారు. తాను తెలంగాణ వ్యతిరేకి కాదంటున్న ప్రధాని.. ఏడున్నరేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదంటూ పలువురు ప్రశ్నించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంపై ప్రధానిగా  ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే అగౌరవమని పలువురు అభిప్రాయపడ్డారు. ట్విట్టర్‌లో మోదీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ(మోదీ తెలంగాణ శత్రువు) అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కనిపించింది.


Updated Date - 2022-02-10T06:54:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising