ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

mock test మాక్ టెస్ట్ తో పోటీ పరీక్షల అభ్యర్థుల మెదడుకు మేధస్సు

ABN, First Publish Date - 2022-05-22T21:39:17+05:30

ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పటే అభ్యర్థులకు టి-సాట్(t-sat) నిర్వహించే మాక్ టెస్ట్(mock test) మరింత మేథస్సు అందిస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పటే అభ్యర్థులకు టి-సాట్(t-sat) నిర్వహించే మాక్ టెస్ట్(mock test) మరింత మేథస్సు అందిస్తుందని సీఈవో శైలేష్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న ప్రభుత్వం ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చక్కటి అవకాశమని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాలు అందిస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు యాప్ (tsat.tv)లో పొందుపరిచిన మాక్ టెస్ట్ ద్వార అభ్యర్థుల మేథస్సుకు మరింత పదును కలగనుందని శైలేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టి-సాట్ మాక్ టెస్ట్ జానర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, తమ భవిష్యత్ తామే నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. 


టెట్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుల్లో 150 ప్రశ్నలతో జానర్ లో అందుబాటులో ఉంటుందన్నారు. 2.30 గంటల సమయంలో 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, సమయం పూర్తయ్యాక యాప్ దానంతటదే మూసివేయబడి, అభ్యర్థి పూర్తి చేసిన ప్రశ్నలకు వెంటనే మార్కులుప్రకటించ బడతాయన్నారు. ఫలితంగా అభ్యర్థి ప్రశ్న పత్రాన్ని ఏ మేరకు పూర్తి చేయగలడో స్పష్టం అవుతుందన్నారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో టి-సాట్ ప్రత్యేకంగా నిర్వహించే మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ప్రధాన పరీక్షలో మంచి విజయం సాధించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన సబ్జెక్టుల్లో సుమారు 25,000 ప్రశ్నలను క్రోడీకరించగా 8000 మంది అభ్యర్థులు మాక్ టెస్ట్ జానర్ లో నమోదు చేసుకున్నారన్నారు. 


మాక్ టెస్ట్ లో ఎలా పాల్గొనాలంటే

మాక్ టెస్ట్ లో పాల్గొనే అభ్యర్థి ‘టి-సాట్ యాప్ tsat.tv లోకి ప్రవేశించాక మాక్ టెస్ట్(mock test) క్లిక్ చేసి టెట్, పోలీసు కానిస్టేబుల్, పోలీసు ఎస్స్రై అప్షన్లలో తాము రాయబోయే పరీక్షను ఎంచుకుని అందులో పేరు, విద్యార్హత, ఈమేయిల్, ఫోన్ నెంబర్ నమోదు చేశాక జానర్ లో కనిపించే 150 ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు గుర్తించి 2.30 గంటల సమయం పూర్తయ్యాక తాము సాధించిన మార్పులు తెరపై కన్పిస్తాయి’ అని సీఈవో శైలేష్ రెడ్డి వివరించారు.అభ్యర్థులు పడిన కష్టానికి మాక్ టెస్ట్ ద్వార ఫలితాన్ని అంచనావేసుకునే అద్భుత అవకాశాన్ని టి-సాట్ కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-05-22T21:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising