ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lashkar Bonalu: హైదరాబాద్కు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నా: కవిత

ABN, First Publish Date - 2022-07-17T19:57:46+05:30

హైదరాబాద్కు ఆశీర్వాదం ఇవ్వాలని మహంకాళి అమ్మవారి కోరుకున్నానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్కు ఆశీర్వాదం ఇవ్వాలని మహంకాళి అమ్మవారి కోరుకున్నానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తెలిపారు. ఉజ్జయినీ మహాకాళి బోనాల జాతర సందర్భంగా కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ (Thalasani Srinivas) నివాసం నుంచి ఆమె బంగారు బోనంతో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దక్షిణాదిలో పెద్ద ఎత్తున వానలు కురుస్తున్నాయని, వానలు తగ్గుముఖం పట్టాలని కోరుకున్నానని తెలిపారు. వరదలు కొన్ని జిల్లాలను దెబ్బతీస్తున్నాయని, వరద ప్రాంతాల వాసులు సురక్షితంగా ఉండాలని కోరుకున్నానని కవిత పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి తొలిపూజలు నిర్వహించారు. గోదావరి తీరంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటిస్తున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సాయంత్రం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో సీఎం పాల్గొంటారు.

Updated Date - 2022-07-17T19:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising