ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారుకు ఎమ్మెల్యే స్టిక్కరుందా.. బేఫికర్‌

ABN, First Publish Date - 2022-07-29T08:46:03+05:30

కారుపై ఎమ్మెల్యే స్టిక్కరుందంటే చాలు.. అందులో ఎవరున్నా.. ఉన్నది ప్రముఖుడేననే భావన. ఆఖరికి వాహనంలో ఎమ్మెల్యే లేకున్నా కారును ఆపే ధైర్యం ఎవరూ చేయరు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నా వెంటనే మార్గం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏడాదికి 3 స్టిక్కర్లు

అధికారిక వాహనాలకే వినియోగించాలి

దుర్వినియోగమైతే బాధ్యత ఎమ్మెల్యేలదే

జూబ్లీహిల్స్‌ ‘రేప్‌’ కేసులోనూ కారుకు స్టిక్కర్‌

తాజాగా ‘క్యాసినో’ నిందితుడి కారుకూ

నేరారోపణలు వస్తున్నా సర్కారు ప్రేక్షకపాత్ర


హైదరాబాద్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): కారుపై ఎమ్మెల్యే స్టిక్కరుందంటే చాలు.. అందులో ఎవరున్నా.. ఉన్నది ప్రముఖుడేననే భావన. ఆఖరికి వాహనంలో ఎమ్మెల్యే లేకున్నా కారును ఆపే ధైర్యం ఎవరూ చేయరు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నా వెంటనే మార్గం సుగమం చేస్తారు. సమయం, ప్రాంతం ఏదైనా పోలీసులు నమస్కారం పెట్టి మరీ వాహనాన్ని పంపిస్తారు. ఇంతటి ప్రాధాన్యం దృష్ట్యా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోనూ ఎమ్మెల్యే స్టిక్కరున్న వాహనాలను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనుచరు లు తమ నాయకుడి పేరిట స్టిక్కరున్న వాహనాల్లో పోలీసుల కళ్లుగప్పి పక్క రాష్ట్రాలకు వెళ్లడం, మాదకద్రవ్యాలు పట్టుబడడం వంటి ఘటన లు గతంలో వెలుగుచూశాయి.


సంచలన ఘటనల్లో..

ఇటీవల హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో ఎమ్మెల్యే స్టిక్కరున్న వాహనం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా క్యాసినో కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి కారుపై మంత్రి మల్లారెడ్డి వాహనానికి విడుదల చేసిన స్టిక్కర్‌ ఉండడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.   కాగా, నేరారోపణలు వచ్చాక తమకు సంబంధం లేదనడం మంత్రులు, ఎమ్మెల్యేలకు సాధారణమే అయినా.. అసలు శాసనసభ కార్యదర్శి స్వయంగా అందించే స్టిక్కర్లపై ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారన్న ప్రశ్నలు వస్తున్నాయి.


పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలదే..

ప్రజాప్రతినిధుల అధికారిక కార్యకలాపాలకు జాప్యం జరగకుండా, ప్రయాణంలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే పేరిట ఉన్న స్టిక్కర్లను అందిస్తారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి మూడు స్టిక్కర్లను శాసనసభ కార్యదర్శి అందిస్తారు. ప్రతి స్టిక్కర్‌పై వాహనం నంబరు, నియోజకవర్గం పేరు, కాలపరిమితి ఉంటాయి. ఏటా ఏప్రిల్‌లో ఇచ్చే వీటికి.. వచ్చే ఏడాది మార్చి దాకా కాలపరిమితి ఉంటుంది. ఈ స్టిక్కర్లు వర్షాలకు తడిసి, ప్రమాదం జరిగి పాడైనా.. వాటి స్థానంలో అదే కాల పరిమితితో అదనంగా రెండు స్టిక్కర్లు పొందవచ్చు. ఇందుకు కారణాలను ఎమ్యెల్యేలు శాసనసభ కార్యదర్శికి తెలపాల్సి ఉంటుంది. ఇక స్టిక్కర్లను ఎమ్మెల్యేలు వారు ప్రయాణించే అధికారిక వాహనాలకు మాత్రమే ఉపయోగించాలి. అయితే, ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువుల వాహనాలకూ అందిస్తున్నారు. కొందరు ఎమ్యెల్యేలు ప్రధాన అనుచరుల కార్లకూ ఇస్తున్నారు. ఇంకొందరైతే మూడు స్టిక్కర్లు చాలవంటూ.. పాడయ్యాయని చెబుతూ అదనంగా వచ్చే రెండు స్టిక్కర్లనూ తీసుకుంటున్నారు. 


పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలున్నా

స్టిక్కర్లను దుర్వినియోగం చేస్తున్నారంటూ గతంలోనూ ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే బాధ్యత వహించాల్సి ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. ఇకనైనా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2022-07-29T08:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising