ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

ABN, First Publish Date - 2022-08-23T16:06:39+05:30

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎ను(MLA Raja sing) పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి దగ్గర రాజాసింగ్‌ను మంగళవారం ఉదయం హైదరాబాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‎ను(MLA Raja sing) పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలో రాజాసింగ్‌ను మంగళవారం ఉదయం షాహీ నాయత్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం రాజాసింగ్ ను పోలీస్ వాహనంలో స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. ఎంఐఎం ఫిర్యాదుతో రాజాసింగ్‎పై కేసు నమోదు చేశారు.

రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముహమ్మద్ ప్రవక్తపై(Prophet Muhammad) బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja sing) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.హైదరాబాద్ పోలీసుల(Hyderabad police) విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వీడియోను(video) యూట్యూబ్(YouTube) నుంచి తొలగించారు.(removed)రాముడిని కించపర్చిన మునావర్‌ ఫారుఖీని హైదరాబాద్‌ తీసుకొస్తే...తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజాసింగ్ హెచ్చరించారు. ‘‘నేను హెచ్చరించినా మునావర్‌తో షో జరిపించారు, పోలీసులకు నేను ముందే దండం పెట్టి వేడుకున్నా, అయినా వినలేదు, మునావర్‌కు కౌంటర్ వీడియోలు చేస్తానని ముందే చెప్పాను’’ అని రాజాసింగ్ పేర్కొన్నారు.రాజాసింగ్ అలా చేసిన వీడియోను యూట్యూబ్‌లో పెట్టడంతో వివాదం చెలరేగింది. 

Updated Date - 2022-08-23T16:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising