ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరం: మంత్రి Talasani

ABN, First Publish Date - 2022-06-28T16:19:37+05:30

మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావును కేంద్రం విస్మరించడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నర్సింహారావు(PV narasimaha rao)ను కేంద్రం విస్మరించడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) అన్నారు. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ (Mahmood Ali), మల్లారెడ్డి (Malla reddy) నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... కిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకువచ్చిన పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పిన పీవీని గౌరవించకపోవడం విచారకరమన్నారు. పీవీ శతజయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి గౌరవించిందని తెలిపారు. మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి పీవీ నర్సింహా రావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. 

Updated Date - 2022-06-28T16:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising