ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంజాన్ పండగ కోసం ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు: తలసాని

ABN, First Publish Date - 2022-03-16T20:22:37+05:30

ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముస్లీం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం అన్ని వర్గాల పండగలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రంజాన్ పండుగ ఏర్పాట్ల పై డిఎస్ఎస్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లుడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం రంజాన్ ను ఘనంగా జరుపుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. నిరుపేదలు సైతం పండుగ ను సంతోషంగా జరుపుకోవాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ఆలోచన అన్నారు. ఈమేరకు నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాకెట్ లను కూడా ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులకు సైతం ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.


మత సామరస్యంతో అన్ని వర్గాల ప్రజలుకలిసి మెలసి జీవిస్తున్న తెలంగాణలో ప్రతి ఏటా రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఆయాశాఖల సమన్వయంతో రంజాన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో పాటు హోంమంత్రి మహమూద్అలీ, ఎస్సీ,మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-16T20:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising