ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నాటక బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా:Talasani

ABN, First Publish Date - 2022-06-27T20:57:27+05:30

కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం(karnataka bus accident) ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన బస్సు ప్రమాదం(karnataka bus accident) ఘటన చాలా బాధాకరమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కర్నాటక లోని కాలా బురగీ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన హైదరాబాద్ లోని బొల్లారం కు చెందిన అర్జున్ కుమార్, అతని భార్య సరళ, కుమారుడు వివన్, K.అనిత,గోదేఖీ ఖబర్ కు చెందిన శివకుమార్, అతని భార్య రవళి, కుమారుడు దీక్షిత్ లు మరణించారు. మరో 7 గురు గాయపడగా ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సోమవారం తన కార్యాలయంలో కంటోన్మెంట్ MLA సాయన్న, కలెక్టర్ శర్మన్ లతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరిగిన రోజే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చెప్పారని తెలిపారు. అంతేకాకుండా మానవతా దృక్పధంతో ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి 3 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. 


ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మేరకు ప్రభుత్వం 24.50 లక్షల రూపాయలు మంజూరు చేయగా, ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున, గాయపడ్డ ఏడుగురికి రూ. 50 వేల చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO లు వసంత కుమారితదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T20:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising