ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఏర్పడ్డాకే హైదరాబాద్ అన్ని రంగాల్లోఅభివృద్ధి:Talasani

ABN, First Publish Date - 2022-06-25T21:28:25+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే అన్ని రంగాలలో హైదరాబాద్ నగర అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే అన్ని రంగాలలో హైదరాబాద్ నగర అభివృద్ధి సాధించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) అన్నారు.సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ ఫ్లై ఓవర్ వద్ద 5 కోట్లతో నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని(foot over bridge) మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూవిశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వేలాది కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. 


నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పాదచారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్ ల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి వివరించారు.GHMC పరిధిలో ఇప్పటికే 7 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ప్రారంభమైనాయని చెప్పారు. మరో 22 నిర్మాణంలో ఉన్మాయన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ పురోగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLC ప్రభాకర్ రావు, MLA సాయన్న, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T21:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising