ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ సంస్కృతికి ప్రపంచ దేశాలలోఎంతో గౌరవం:Talasani

ABN, First Publish Date - 2022-06-13T23:28:37+05:30

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి  లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడి తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్(meet and greet) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహకులు మంత్రిని ఘనంగా సన్మానించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగలను నేడు అనేక దేశాలలో నిర్వహించడం తెలుగు ప్రజలుగా మనకెంతో గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా బోనాల పండుగకు సంబంధించిన బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరించారు. సంస్కృతి, సాంప్రదాయాలు మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి అని, దానిని పరిరక్షించుకోవాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు. మనం ఎక్కడ ఉన్నా మన మూలాలను మరువద్దని పిలుపునిచ్చారు. 


దేశంలోనే గొప్ప పాలనను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల లో అనేక అద్బుతాలు చోటుచేసుకున్నాయని చెప్పారు.మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో యువనేత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ (sai kiran yadav) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-13T23:28:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising