ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ఏర్పడిన తర్వాతనే దేవాలయాల అభివృద్ధి: మంత్రి తలసాని

ABN, First Publish Date - 2022-01-30T20:45:56+05:30

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే పలు చారిత్రక దేవాలయాల అభివృద్ధి జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమరవెల్లి: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతనే పలు చారిత్రక దేవాలయాల అభివృద్ధి జరుగుతోందని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ చింతన కలిగిననేత అని అందుకే ప్రజల మనోభావాలకనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దతున్నారని అన్నారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లన్న ను, కొండ పోచమ్మ అమ్మవారి ని  కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కొమురవెళ్లి ఆలయం వద్ద  భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.


గతంలో ఎన్నడూ లేని విధంగా కొమురవెళ్లి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. ఈ దేవాలయానికి చేరుకునే అన్ని రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. అంతే కాకుండా వసతి కోసం కాటేజెస్, త్రాగునీటి సౌకర్యం కల్పించిందన్నారు. అలాగే కొండ పోచమ్మ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని మంత్రి తలసాని తెలిపారు.యాదాద్రి నిర్మాణం అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దబడుతోందన్నారు. 


భద్రాచలం, వేములవాడ దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు.గత పాలకులు ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. నేడు ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే  కొందరు విమర్శలు చేస్తున్నారు. 74 ఏండ్ల గోస నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు విముక్తి లభించిందని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-30T20:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising