ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ – మంత్రి తలసాని

ABN, First Publish Date - 2022-01-27T22:34:33+05:30

సికింద్రాబాద్ లోని మహాత్మాగాంధీ రోడ్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది గాంథీ విగ్రహమే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని మహాత్మాగాంధీ రోడ్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది గాంథీ విగ్రహమే.సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఈ విగ్రహం వుంది. ఆ కారణంగానే ఈ ప్రాంతానికి ఎంజిరోడ్అనేపేరు వచ్చింది. ఇటీవల నగరంలోని పలు చారిత్రక నిర్మాణాలను కాపాడేందుకు ప్రభుత్వం వాటిని పునరుద్దరించే పనులనుచేపట్టింది. అందులో భాగంగానే సికింద్రాబాద్ బన్సీలాల్ పేట లో ఉన్న నిజాం కాలం నాటి మెట్ల భావిని ప్రభుత్వం పునరుద్దరిస్తోంది. 


తాజాగా ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం పరిసరాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గురువారం గాంధీ విగ్రహం పరిసరాలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గాంధీ విగ్రహానికి పక్కనే నూతనంగా మరో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను వేరొక చోటకు తరలించాలని ట్రాన్స్ కో ఎస్ఈ రవీందర్ ని మంత్రి ఆదేశించారు. 


ప్రస్తుతం ఉన్న స్థలానికి అదనంగా పక్కనే ఉన్న స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. గాంధీ విగ్రహం పరిసరాల అభివృద్దికి రూపొందించిన నమూనా ను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంత్రికి చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీ ముకుంద రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-01-27T22:34:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising