ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన రైతుబంధు సంబురాలు

ABN, First Publish Date - 2022-01-10T21:39:43+05:30

నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతుబంధు కార్యక్రమం క్రింద పంట పెట్టుబడి కోసం  రైతులకు 50 వేల కోట్ల రూపాయల సాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని అన్నారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబంధు వేడుకలు నిర్వహిస్తున్నారు. 


ఈవేడుకలకు తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తన్నీరు హరీష్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంఎల్సీ ప్రభాకర్, ఎంఎల్ఏలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, గోపినాధ్, టీఎస్ ఎంఐడిసి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత తదితరులు సంబురాలకు హాజరయ్యారు. సంక్రాంతి పండుగ ను తలపించేలా గంగిరెద్దుల ఆటలు, రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మల ఏర్పాటు కళాకారుల డప్పుచప్పుళ్ళు, నృత్యాలతో ఎన్టీఆర్ స్టేడియం సందడిగా మారింది. 

Updated Date - 2022-01-10T21:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising