ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసక్తి ఉన్న రంగాల్లో పిల్లలను ప్రోత్సహించాలి:Talasani

ABN, First Publish Date - 2022-05-25T20:07:45+05:30

పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రానిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పిల్లలకు ఆసక్తి ఉన్న రంగాలలో ప్రోత్సహించాలని, అప్పుడే వారు మరింత ఉన్నతంగా రానిస్తారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) అన్నారు. బుధవారం సైదాబాద్ కు చెందిన న్యాయవాది ఫసియోద్దిన్ ఇటీవల గోవాలో ఈ నెల 6 నుండి 8 వ తేదీ వరకు జరిగిన నేషనల్ టైక్వాండో చాంపియన్ షిఫ్ లో సిల్వర్ మెడల్స్ సాధించిన తన ఇద్దరు కుమార్తె లు ఉమైమా పాతిమా, సుమమ పాతిమా లతో కలిసి వచ్చి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే నేషనల్ లెవెల్ పోటీలలో సిల్వర్ మెడల్ ను సాధించడం చిన్నారుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణం అన్నారు. అవార్డులు సాధించిన ఇద్దరు చిన్నారులను మంత్రి అభినందించారు. మరింతగా రానించే విధంగా ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

Updated Date - 2022-05-25T20:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising